తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలతో ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు సోనూసూద్... అనంతపురంలో ఇంటివద్దకే ఉచిత ఆక్సిజన్ సేవలు ప్రారంభించారు. సోనూసూద్ ఫౌండేషన్ అనంతపురంలో రోగుల ఇంటి వద్దకే ఆక్సిజన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ... 24 గంటలు ఆక్సిజన్ సేవలు ఇంటి వద్దకే అందించే లక్ష్యంతో ప్రారంభించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో తొలిసారిగా ఆక్సిజన్ సేవలు అనంతపురం నుంచే మొదలుపెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. బెంగళూరులో ఇప్పటికే రోజూ 180కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కరోనా రోగుల ఇంటి వద్దే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం నగరానికి 80 కిలోమీటర్ల దూరం వరకు ఆక్సిజన్ సేవలు అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... CM Jagan With Union Ministers: జగన్ దిల్లీ టూర్.. ఎవరెవరిని కలిశారంటే..