ETV Bharat / state

మెుదటి విడత: కదిరి డివిజన్​ 6 పంచాయతీల్లో వైకాపా ఏకగ్రీవం - ఏకగ్రీవాల వార్తలు

అనంతపురం జిల్లా కదిరి డివిజన్​లోని 6 పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా కూడా పోటాపోటీగా తన అభ్యర్థులను రంగంలో నిలిపి పోటీ ఇచ్చారు. పోలీసుల అప్రమత్తతతో ఇప్పటివరకు అంతా ప్రశాంతంగానే సాగింది. ఉపసంహరణ గడువు ముగియడంతో నామపత్రాల పరిశీలన కొనసాగుతోంది.

anantapur election updates
అనంతపురం జిల్లాలో 6 ఏకగ్రీవాలతో మెుదటి విడత
author img

By

Published : Feb 5, 2021, 4:25 PM IST

అనంతపురం జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే కదిరి డివిజన్​లో ఆరు గ్రామ పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. పలుచోట్ల తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు తీవ్ర వత్తిడి తెచ్చినప్పటికీ ఎక్కడా లొంగలేదు. నల్లమడ మండలం చెర్లోపల్లిలో వైకాపా మద్దతుతో నామినేషన్ వేసిన అభ్యర్థి ఏకగ్రీవం అయినప్పటికీ, అక్కడ తెదేపా మద్దతున్న అభ్యర్థితో మూడేళ్లే కొనసాగే ఒప్పందం చేసుకున్నారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న ధర్మవరం డివిజన్​లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి నామపత్రాల పరిశీలన కొనసాగనుంది.

మెుదటి విడత ఇలా..

అనంతపురం జిల్లాలో వైకాపా నేతల పాచికలు పారలేదు. గ్రామ పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులైన సర్పంచి అభ్యర్థులను బెదిరించినప్పటికీ ఎక్కడా తగ్గకుండా అన్నిచోట్లా పోటాపోటీగా నిలిచారు. తొలివిడత ఎన్నికలు జరిగే కదిరి డివిజన్​లో గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ డివిజన్​లో 169 సర్పంచి స్థానాలుండగా ఆరుచోట్ల తెదేపా అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సర్పంచి స్థానాలకు 1093 నామినేషన్లు దాఖలు చేయగా, వీటిలో 112 మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణకు ముందు 893 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చగా, ఉపసంహరణల అనంతరం 465 మంది సర్పంచి అభ్యర్థులుగా పోటీలో మిగిలారు.

రెండో విడత ఇలా..

రెండో విడత ఎన్నికలు జరిగే ధర్మవరం డివిజన్​లో 307 సర్పంచి స్థానాలుండగా, 2992 వార్డులున్నాయి. వీటికి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయటానికి గురువారంతో గడువు పూర్తైంది. పలుచోట్ల తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు.

మనస్థాపంతో పురుగుల మందు తాగి..

ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడు కనగానపల్లి మండలంలో ఓ మహిళకు హామీఇచ్చి నామినేషన్ వేయించాడు. ప్రజాప్రతినిధి ఆ మహిళకు ఫోన్ చేసి, వార్డుకు నిలబడటానికి కూడా స్థాయి చాలదని ఆమెను కించపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి మనస్తాపం చెందిన ఆ మహిళ.. నామినేషన్ కేంద్రం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

వాలంటీర్​ నుంచి సర్పంచ్​ ఎన్నికలకు..

రాప్తాడు మండలంలో ప్రజాప్రతినిధి ఆదేశంతో గ్రామ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసింది. అదే స్థానానికి మరో మహిళతో ఇంకో నాయకుడు నామినేషన్ వేయించారు. ఇద్దరు పోటీలో ఉంటారా లేదా అనేది ఉపసంహరణ అనంతరం తెలియనుంది.

ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే..

రెండు విడతల్లో జరిగిన నామినేషన్ల ప్రక్రియలోనూ, తొలి విడత ఉపసంహరణలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసులు అన్నిచోట్ల ముందస్తుగానే నిఘా పెట్టి చర్యలు తీసుకోవటంతో ఇప్పటివరకు అంతా సజావుగా సాగింది.

ఇదీ చదవండి:

'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు.. ప్రజలు సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.