ETV Bharat / state

ఈటీవీ చొరవ...తొలగిన మహిళల ఇబ్బందులు

అనంతపురం జిల్లా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మహిళల సమస్యల పై ఈటీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా...వెంటనే స్పందించిన అధికారులు సత్వర చర్యలకు పూనుకున్నారు.

Shulter Women Problems in anantapuram
అనంతపురం జిల్లాలో పునరావాస మహిళల సమస్యలు పరిష్కారం
author img

By

Published : Apr 28, 2020, 1:34 PM IST

లాక్‌డౌన్‌ వేళ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచి వసతులు కల్పించిన విషయం తెలిసిందే. ఇలా అనంతపురం జిల్లాలో 31 కేంద్రాల్లో 1,100 మందిని ఉంచారు. వీరిలో 273 మంది మహిళలు ఉన్నారు. వారిలో 18-30 ఏళ్ల మధ్య వయసున్న వారు 150 మంది ఉన్నారు. వీరంతా కేంద్రం దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. వీరిలో చాలా మంది నెలసరి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శానిటరీ న్యాప్కిన్స్‌ అందుబాటులో లేక అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్య ‘ఈటీవీ’ దృష్టికి రాగా మెప్మా పీడీ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లింది. తీవ్రత గుర్తించిన అధికారిణి పునరావాస కేంద్రాల్లోని యువతులకు అవసరమైన అన్ని వస్తువులనూ పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కరించిన అధికారిణికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతపురం జిల్లాలో పునరావాస మహిళల సమస్యలు పరిష్కారం

ఇవీ చదవండి...గూడు చేరని జాలర్ల గోడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.