అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సి ఆరునెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తమ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. ఆరునెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ నిలదీశారు.
ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు ఇవ్వాలని సెక్యూరిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు