ETV Bharat / state

ఎస్​ఈబీ విస్తృత దాడులు... అక్రమ మద్యం పట్టివేత - illigal liqour cought by seb

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

seb raids
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్​ఈబీ తనిఖీలు
author img

By

Published : Mar 28, 2021, 1:53 PM IST

అనంతపురం జిల్లాలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పరిగి మండలంలోని కోనాపురం క్రాస్ వద్ద 180 కర్ణాటక మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఆదోని శివారు రణమండల కొండల్లో జరిపిన తనిఖీల్లో 400 లీటర్ల ఐడీ , బెల్లపు ఊటను గుర్తించి.. ధ్వంసం చేశారు. సారా తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠినంగా వ్యవహరిస్తామని ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. షేక్ జానీ భాష అనే వ్యక్తి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారి.. కనిపించని సిబ్బంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.