రాష్ట్రవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా(Sardar Vallabhbhai Patel Jayanti celebrations) నిర్వహించారు. పలు జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ(Run for Unity) కార్యక్రమాన్ని స్థానిక పోలీసులు నిర్వహించారు.
అనంతపురం జిల్లా
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు అమోఘమని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రానా టాటా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జాతీయ ఐక్యత దినం నిర్వహించారు.పటేల్ సేవలను కొనియాడారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ(Run for Unity)కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప జిల్లా
జాతీయ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'ఏక్తా పరుగు' ను నిర్వహించారు. పరుగులో ముందు వచ్చిన అభ్యర్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
నెల్లూరు జిల్లా
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ను పురస్కరించుకుని నెల్లూరులో 5కే రన్ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీ(Run for Unity) పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విజయారావు ప్రారంభించారు. నగరంలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రన్ కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు సాగింది. పటేల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిగామ, గుడివాడ, మచిలీపట్నంలో పోలీసులు రన్ ఫర్ యూనిటీ(Run for Unity) కార్యక్రమాన్ని నిర్వహించారు. పటేల్ సేవలను అధికారులు కొనియాడారు.
శ్రీకాకుళం జిల్లా
పోలీసు సిబ్బందికి ఐక్యతా భావాన్ని పెంపొందించుకొని నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించాలని శ్రీకాకుళం ఆదనపు ఎస్పీ సోమశేఖర్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ (Run for Unity)కార్యక్రమాన్ని నిర్వహించారు. పరుగు పందెంలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానంలో అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి యానం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ, జిల్లా ఎస్పీ ఇతర పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ(Run for Unity) కార్యక్రమాన్ని నిర్వహించారు. పటేల్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని, దేశ ఐక్యత, సౌభ్రాత్రత్వం, అంతర్గత భద్రతకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. . ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, యువత పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యమత్యాన్ని చాటుతూ ఏక్తా పరుగు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి రాజ్ విహర్ కూడలి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం విద్యార్థులచే అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి