అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. తమకు పనిముట్లు ఇవ్వాలని నగరంలోని కోర్టు రోడ్డు ట్యాంకు సర్కిల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. పురుషులు ట్యాంక్ ఎక్కి నిరసన తెలపగా.. మహిళా కార్మికులు పరకలు చూపుతూ ప్రదర్శన చేశారు. చాలీచాలని పనిముట్లతో ఏళ్లుగా నెట్టుకొస్తున్నామని, ఇప్పటికైనా సరైన పనిముట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :