అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ యజమానులను... స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో ట్రాక్టర్స్ యజమానులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...స్థానికులు ఆరోపించారు.
ఇవీ చదవండి: