ETV Bharat / state

ఆధార్ లింక్​ కోసం.. మహిళల పడిగాపులు - అనంతపురంలో చేయూత పథకం

వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులైన మహిళలు.. వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం కావాలనే నిబంధనతో మహిళలు ఆధార్ కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. అనంతపురం జిల్లా తనకల్లు ఆధార్ సేవ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు.

long line for aadhar link at ananthapur
long line for aadhar link at ananthapur
author img

By

Published : May 29, 2021, 9:34 PM IST

ఆధార్​ కార్డ్​కు ఫోన్​ అనుసంధానం చేయడం కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురం జిల్లా తనకల్లు ఆధార్ సేవ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు (మహిళలు) ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్​కు మొబైల్ లింక్ కోసం మహిళలు బారులు తీరారు.

ఒక్కరోజు 50 మందికి మాత్రమే మొబైల్ అనుసంధానం చేయడానికి వీలు ఉంటుందని సిబ్బంది తెలియజేస్తున్నా.. మహిళలు వినిపించుకోలేదు. అర కిలోమీటరు మేర బారులు తీరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళలకు నచ్చజెప్పి తిప్పి పంపించారు.

ఇదీ చదవండి:

Viral: విష సర్పానికి నోటితో ఆక్సిజన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.