అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రంలో రూ.5 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా గుంతల రోడ్డుతో అవస్థలు పడుతున్న సోమందేపల్లి ప్రజల కలలను నెరవేరుస్తూ గత ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో రూ.5 కోట్లతో పనులు ప్రారంభించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా... ప్రస్తుతం శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికి రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేస్తున్నారని అన్నారు. సోమందేపల్లిలోని అంబేడ్కర్ కూడలి నుంచి కొత్తపల్లి కూడలి వరకు నాలుగు వరసల రహదారి, కొత్తపల్లి చెరువు కట్ట వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే రోడ్డు నిర్మించటంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: