అనంతపురంలో లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన బంగారమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కుమారుడు శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన బంగారమ్మ.. కుమారుడితో కలసి శాంతి నగర్ బోర్డులో ఉన్న దుకాణానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి