రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నీటి వాటాలను పెంచాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ అనంతపురం జిల్లా కదిరికి చేరుకుంది. కర్నూలులో చేపట్టిన ఈ ప్రదర్శన చిత్తూరు జిల్లాలో ముగియనుంది. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలంటూ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. రాజధాని, హైకోర్టు నిర్మాణ విషయంలో పాలకులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సీమను అభివృద్ధి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :