సిబ్బంది నిర్లక్ష్యం
ఒక్క రోజులో పని కావడం లేదని.. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు వెళ్లిన ప్రజల పట్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సిబ్బందికి ఇష్టం వచ్చిన సమయంలో మాత్రమే నామమాత్రంగా పనిచేస్తుండటం వలన సాయంత్రం వరకు ఎదురుచూసి తిరిగి గ్రామాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్ పని చేస్తున్నప్పటికీ... నెట్వర్క్ లేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ లింకు చేయించుకునేందుకు 10 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ పని కావడంలేదని వాపోతున్నారు. ప్రజలకు ఎప్పుడు రావాలో కూడా ఉద్యోగులు చెప్పకపోవడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని చెబుతున్నారు.
ఇదీ చదవండి :