Power Cut: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలో విద్యుత్ బిల్లు చెల్లించలేదని.. గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను ఆ శాఖ అధికారులు మంగళవారం నిలిపివేశారు. విద్యుత్ బిల్లులు సుమారు రూ.1.40 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం. బకాయిలు చెల్లించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో.. విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
దీంతో కార్యాలయంలో పలు పనులు నిలిచిపోయాయి. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం,అధికారుల తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయించాలని కోరామని.. అయినా పట్టించుకోలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి :