- వైద్యుల పట్ల నిర్లక్ష్యం.. బాధేస్తోంది: చంద్రబాబు
ప్రాణదాతలైన వైద్యుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధ కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి... ప్రజలకు వైద్య సేవలందిస్తున్న దేవుళ్లకి... జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులకు ఇంతవరకు వ్యక్తిగత రక్షణ దుస్తులు ఇవ్వకపోవటం… రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని చంద్రబాబు మండిపడ్డారు. పీపీఈల కోసం విశాఖ వైద్యులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. మాస్క్లు అడిగిన పాపానికి డాక్టర్సు ధాకర్ను సస్పెండ్ చేసి... లాఠీలతో కొట్టి పిచ్చివాడనే ముద్ర వేశారని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలని చంద్రబాబు హితవు పలికారు.
- వైద్యుల సేవలను వైకాపా గుర్తించాలి: లోకేశ్
కుటుంబాలకు దూరంగా, ప్రాణాంతక కరోనాకి దగ్గరగా ఉంటూ విధి నిర్వహణే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్లందరికీ... జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైకాపా ప్రభుత్వం వారి సేవలను ఏమాత్రం గుర్తించకపోగా... అవమానాలకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వైద్యల సేవలను గుర్తించాలని డిమాండ్ చేశారు.
- కరోనా టైంలో వైద్యులకు అండగా నిలవాలి..: పవన్
కరోనా రోగుల సేవలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కర్కశంగా విజృంభిస్తున్న తరుణంలో... ప్రాణాలు లెక్కచేయక విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. నిత్యం కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు భగవంతుని ప్రతిరూపాలని... అలాగని మొక్కినంత మాత్రాన సరిపోదని... వారి అవసరాలను తీర్చాల్సిన భాద్యత ప్రభుత్వంతో పాటు... పౌర సమాజంపైనా ఉందన్నారు.
డాక్టర్స్డేను పురస్కరించుకుని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో... కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు... సన్మానం చేశారు. కరోనా కట్టడిలో వారు చేస్తున్న కృషిని కొనియాడారు.
ఇదీ చదవండి: కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్