అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొండగుట్టలో నాటుసారా స్థావరాలపై గుత్తి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్రెడ్డి అన్నారు.
7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సారా తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యారు. నిబంధనలను అతిక్రమించి నాటుసారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: