ETV Bharat / state

8 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వ్యక్తి అప్పగింత.. సంతోషంలో కుటుంబ సభ్యులు! - ఇంటి నుంచి వెళ్లిపోయిన బాబా ఫక్రుద్దీన్​ ఆచూకీ గుర్తింపు

ఎనిమిది ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన బాబా ఫక్రుద్దీన్​ ఆచూకీని అనంతపురం రెండో పట్టణ పోలీసులు కనుగొన్నారు. అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు..!

8 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన బాబా ఫక్రుద్దీన్​

author img

By

Published : Feb 21, 2022, 8:13 PM IST

ఎనిమిది ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దల చెరువు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్​కు 2003లో అనంతపురం పట్టణానికి చెందిన కుల్లాయమ్మతో వివాహమైంది. 2009 నుంచి అనంతపురంలో నివాసమంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వాళ్లకు ఇతనికి ఇద్దరు పిల్లలు.. ఫయాజ్, ఖాసీం.

అయితే.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో మిత్రులు, బంధువుల నుంచి కొంత అప్పు చేశాడు. చేసిన అప్పు కట్టలేక 2014లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు బాబా ఫక్రుద్దీన్. అప్పట్లో వారి కుటుంబ సభ్యులు బాబా ఫక్రుద్దీన్ కనబడటంలేదని రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగాంగా.. పోలీసులు బాబా ఫక్రుద్దీన్​ను కనిపెట్టారు. ఇవాళ సీఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. బాబా ఫక్రుద్దీన్​ను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

8 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన అతన్ని చూసి ఆ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు కుల్లాయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఫక్రుద్దీన్ ఆచూకీ కనుగొనడంలో రెండో పట్టణ పోలీసులు చూపిన చొరవకు గానూ సదరు పోలీసులను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.

ఇంటినుంచి వెళ్లిపోయిన బాబా ఫక్రుద్దీన్.. 6 ఏళ్లపాటు కేరళలో కూలి పని చేసేవాడు. తర్వాత కడప జిల్లాకు వచ్చి ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతంలో ఉంటూ ఆటో నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విచిత్రమైన దొంగ.. బంగారం, డబ్బు వదిలేసి ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.