ప్లాస్టిక్‌తో ప్రపంచం మమేకమైపోతోంది. ఇదే ప్లాస్టిక్.. పర్యావరణాన్ని విపరీతంగా కలుషితం చేస్తోంది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇద్దరు విద్యార్థులతో ఓ ఉపాధ్యాయురాలు చేసిన ప్రయోగం.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అనంతపురం జిల్లా ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ, ఎనిమిదో తరగతి చదువతున్న విశ్వాస్, కమలనాథ్... ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద పేరుకు పోకుండా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ప్రయోగం రూపంలో అమల్లో పెట్టారు.
ప్లాస్టిక్ కవర్లను సేకరించి, ఓ గోళంలో కరిగించారు. ఆ ప్లాస్టిక్‌ను కంకర, ఇసుక సిమెంటతో కలిపి ఇటుకులు తయారు చేశారు. ఇవి మామూలు ఇటుకుల కంటే దృఢంగా ఉన్నాయి. ఇటీవల జరిగన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శించగా.. ప్రశంసలు అందుకుంది. డిసెంబర్లో కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలకూ ఎంపికైంది.
ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని తీసుకురావటమే తమ లక్ష్యం అని ముక్త కంఠంతో చెప్తున్న ఈ ఉపాధ్యాయిని, విద్యార్థుల కృషి అభినందనీయం.
ఇదీ చదవండి: శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం