అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని మీటేనాయక్ తండా, బోడెనాయక్ తండా రామదాస్ నాయక్ తండాల్లోని ప్రజలు రెండు రోజులుగా పెద్ద వింత శబ్దాలతో వణికిపోతున్నారు. పెద్ద శబ్దాలు, ఇంటిలోని సామగ్రి కదిలినట్లు కనిపించడం వల్ల మనుషులతో పాటు కుక్కలు, గొర్రెలు సైతం ఉలిక్కి పడుతూ పరుగులు పెట్టడం వల్ల గ్రామస్థులు మరింత భయాందోళనకు గురయ్యారు.
తండాల్లో వింత శబ్దాలు.. భయభ్రాంతుల్లో ప్రజలు - Villagers spooked over mysterious sounds
రేయింబవళ్లు తేడాలేకుండా మూడు గ్రామాల ప్రజలు వింత శబ్దాలతో భయబ్రాంతులకు గురవుతున్నారు. శబ్దాలు ఎక్కనుంచి వస్తున్నాయో... ఏమై ఉంటాయో? తెలియక రాత్రంతా జాగారం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని తండాల్లో జరిగింది.
![తండాల్లో వింత శబ్దాలు.. భయభ్రాంతుల్లో ప్రజలు people shocking with mysterious sounds yerradoddi village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9231434-331-9231434-1603100780857.jpg?imwidth=3840)
తండాల్లో వింత శబ్దాలు.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని మీటేనాయక్ తండా, బోడెనాయక్ తండా రామదాస్ నాయక్ తండాల్లోని ప్రజలు రెండు రోజులుగా పెద్ద వింత శబ్దాలతో వణికిపోతున్నారు. పెద్ద శబ్దాలు, ఇంటిలోని సామగ్రి కదిలినట్లు కనిపించడం వల్ల మనుషులతో పాటు కుక్కలు, గొర్రెలు సైతం ఉలిక్కి పడుతూ పరుగులు పెట్టడం వల్ల గ్రామస్థులు మరింత భయాందోళనకు గురయ్యారు.
ఎక్కనుంచి వస్తున్నాయో తెలియదు
మొదటిలో బాణాసంచా శబ్దాలై ఉండొచ్చని భావించి పరిసర ప్రాంతాల్లో ఆరా తీశామని... ఎక్కడ బాణాసంచా కాల్చిన దాఖలాలు కనిపించలేదు గ్రామస్థులు తెలిపారు. తండాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలలో పేలుళ్లు కావొచ్చని కొండల్లో చూశామన్నారు. అడవిలో ఎలాంటి పేలుళ్లు జరగలేదని నిర్ధారించుకున్న తండాల వాసులు భయంతో రాత్రంతా జాగారం చేశామని వివరించారు.
అధికారులకు సమాచారం
ఈ విషయాన్ని తెల్లవారుజామునే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ ఆదేశంతో తహసీల్దార్, ఎంపీడీవో, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు తండాలను సందర్శించారు. ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ప్రజలు ఎవరు ఆందోళనకు గురికావద్దని సూచించారు. శబ్దాలు వచ్చి, ఇల్లు కనిపించే సమయంలో ఇళ్లలోంచి బయటకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి: