అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాధికారులు, కమిటీ సభ్యుల తీరు వివాదానికి దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న తరుణంలో.. రహదారి విస్తరణకు ఆలయ బలిపీఠం అడ్డు ఉందంటూ తొలగింపు ప్రక్రియకు సిద్ధమయ్యారు. బలిపీఠాలకు ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో స్థానికులు అడ్డుతగిలారు. వందల ఏళ్లుగా ఆలయం చుట్టూ ఉన్న స్వామివారి బలిపీఠాలు ఎలా తొలగిస్తారని స్థానికులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా విశ్వహిందూ పరిషత్, భాజపా నాయకులు స్వామివారి ఆలయం పశ్చిమ గోపురం వద్ద ఆందోళన చేపట్టారు.
లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బలిపీఠాల తొలగింపు ప్రక్రియకు సిద్ధమైన.. ఈవో వెంకటేశ్వరరెడ్డి స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: