అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, రఘువీరారెడ్డి దంపతులు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిపించారు. నలభై సంవత్సరాలుగా శ్రీరామ నవమి రోజున 30 నుంచి 50 నిరుపేద వధూవరులకు బట్టలు, తాళి బొట్టు ఇచ్చి ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. కరోనా కారణంగా ఈ సారి సామూహిక పెళ్లిళ్లు రద్దయ్యాయి. కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఆగిపోవటంతో రఘువీరారెడ్డి దంపతులు బాధను వ్యక్త పరిచారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పరిమిత భక్తులతో సీతారాముల కల్యాణం నిర్వహించారు.
ఇదీ చదవండి: కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి