ETV Bharat / state

ఉరవకొండ గ్రామ పంచాయతీలో సుంకాల వసూలుకు టెండర్లు

author img

By

Published : Mar 31, 2021, 5:41 PM IST

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో వివిధ సుంకాలు వసూలు చేసుకునేందుకుగాను టెండర్లు పిలిచారు. గతంతో పోలిస్తే మేజర్ పంచాయతీకి ఆదాయం భారీగా పెరిగింది.

uravakonda tenders
ఉరవకొండ పంచాయతీ టెండర్ల వార్త

అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో సుంకాల వసూలు నిమిత్తం నిర్వహించిన టెండర్లలో.. పంచాయతీకి భారీ ఆదాయం లభించింది. ప్రత్యేక అధికారి దామోదరరెడ్డి, ఈవో శ్యామల ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో దినసరి మార్కెట్, బస్టాండ్, మేకలు - గొర్రెలు, పాయిఖానా నిర్వహణకు సుంకం వసూళ్ల హక్కు నిమిత్తం టెండర్లు నిర్వహించారు.

వీటిలో పెద్దమొత్తంలో టెండర్లు దాఖలయ్యాయి. గత ఏడాది రూ.17,63,600/- ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది రూ. 32,06,342/- గ్రామ పంచాయతీ ఖజానాకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం దాదాపు రెట్టింపు అయ్యిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

మాస్కులు లేనివారికి జరిమానా.. అనర్థాలపై పోలీసుల అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.