గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారి (డీడీవో) బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి వీర్వోలకు ప్రభుత్వం బదిలీ చేయడంపై పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయితీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన జీవో నెంబర్ 2 ను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ అధికారాలను రెవెన్యూ శాఖకు బదలాయించడాన్ని తప్పు పట్టారు.
ఇదీ చదవండి: