Opposition Leaders on Jocky Company: ఆరు వేల మందికి జీవనోపాధి కల్పించే జాకీ పరిశ్రమను రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బెదిరించటం వల్లనే తెలంగాణకు తరలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల అరాచకాలు పెచ్చుమీరిపోయాయన్నారు. జాకీ పరిశ్రమ తరలిపోకూడదని పేదల పక్షాన ఆందోళన చేసిన సీపీఐ, తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు పెట్టిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. రూ.పది కోట్లు డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలు వైసీపీ ప్రజాప్రతినిధుల బెదిరింపులతో తరలిపోతున్నాయని రామకృష్ణ ఆరోపించారు.
"ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అందరూ కలిసి పరిశ్రమలు ఒకదాని తర్వాత మరొకటి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్తున్నారు. కానీ, తీర చూస్తే ఒకదాని తర్వాత మరొకటి వెళ్లిపోతున్నాయి. పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించిన ఎమ్మెల్యేపై కేసులు ఎందుకు పెట్టలేదు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించాలి." -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
జాకీ పరిశ్రమ ప్రతినిధులను వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బెదిరించడంతో.. పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. టీడీపీ హయాంలోనే వెళ్లిపోయిందని తప్పుడు సమాచారానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు మాటలు ఎన్ని చెప్పినా ప్రజలు వినే స్థితిలో లేరని ఆయన హెచ్చరించారు.
"వాళ్ల హయాంలో వచ్చింది.. వాళ్ల హయాంలోనే వెనుతిరిగిందనే మాటలకు తెరలేపావు. ఆ సంస్థ ఆధికారులపై దురుసుగా ప్రవర్తించడం వల్లే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఆంశాలను నువ్వు గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఉంది." -పరిటాల శ్రీరామ్, తెదేపా నేత
ఇవీ చదవండి: