ETV Bharat / state

కౌన్​బనేగా కరోడ్​పతి అంటూ రూ.66 వేలు దోచేశారు!

author img

By

Published : Nov 16, 2019, 6:47 AM IST

రూ. 25 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయని ఫోన్ రాగానే ఆ వ్యక్తి ఉప్పొంగిపోయాడు. ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని సంబరపడ్డాడు. వెంటనే మరో ఖాతాలోకి 66 వేల నగదు జమ చేస్తే మెుత్తం నగదు మీ సొంతమే అన్న మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాడు.

ఆన్​లైన్ మోసం
ఆన్​లైన్ మోసం
కౌన్‌బనేగా కరోడ్​పతి పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.66 వేలను సైబర్​ మోసగాళ్లు దోచేసిన సంఘటన.. అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం ఎన్​ఎస్​గేట్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వన్నూరు అలీ మొబైల్​ఫోన్​కు... ఓ కాల్‌ వచ్చింది. కౌన్​బనేగా కరోడ్​పతి కార్యక్రమం ద్వారా మీరు 25 లక్షలు గెలుచుకున్నారని అజ్ఞాతవ్యక్తి ఆలీకి చెప్పాడు. మీ ఫోన్‌నంబర్‌ మీద 25 లక్షలు మీ ఖాతాలో జమయ్యాయని నమ్మబలికాడు. ఆ సొమ్మును తీసుకునేందుకు తక్షణమే 66వేలు వేయాలంటూ వేరే ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మిన అలీ... సదరు ఖాతాలో 66వేలను రెండు విడతల్లో డిపాజిట్‌ చేశాడు. ఇక 25లక్షలు వచ్చేశాయనుకుంటున్న అలీకి... మరో 60వేలు ఖాతాలో వేయాలంటూ అజ్ఞాతవ్యక్తి నుంచి మళ్లీ ఫోన్‌ వచ్చింది. అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా... సొమ్ము జమచేసిన నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని తేల్చారు. డబ్బులు వస్తాయన్న నమ్మకంతో పది రూపాయల వడ్డీకు పెద్ద మెుత్తంలో డబ్బు తెచ్చి నిండా మునిగిపోయానంటూ బాధితుడు బోరున విలపిస్తున్నాడు. డబ్బు జమ అయ్యిందంటూ వచ్చే ఫోన్లను నమ్మెుద్దంటూ బాధితుడు కోరుతున్నాడు.

ఇదీ చదవండి: అనిశాకు చిక్కిన అనంతపురం పంచాయితీరాజ్ ఈఈ

Intro:ap_atp_51_15_online_mosam_avb_ap10094

Body:ఆన్ లైన్ లో మోసపోయిన కష్టజీవి.

అనంతపురం జిల్లాలో ఆన్ లైన్ మోసానికి ఓ అమాయకుడు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును క్షణాల్లో పోగొట్టుకున్నాడు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం లో n s గేటు గ్రామానికి చెందిన వన్నూరు వలి బుధవారం తన మొబైల్ ఫోన్ లో యాప్ ను ఓపెన్ చేశాడు వెంటనే ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కరోడ్పతి పేరుతో ఫోన్ నెంబర్ మీద 25 లక్షలు మీ ఖాతాలో జమ అయిందని నమ్మబలికాడు. నీవు తక్షణమే 66,000 మొత్తాన్ని అకౌంట్లోకి జమ చేయాలని నమ్మించి ఖాతా నెంబర్ ఇచ్చాడు దీన్ని పూర్తిగా నమ్మిన వలి ధర్మవరం sbi లో నగదు ట్రాన్సుఫర్ చేశాడు. మొదట 16323 రూపాయలు తర్వాత 29000,21000 జమ చేశాడు. తర్వాత మళ్లీ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ చేసి మరో 60వేల పంపమని ఇంకో ఖాతా నెంబర్ ఇచ్చాడు అనుమానం కలిగిన బాధితుడు కెనరా బ్యాంకు లో జరిగిన విషయాన్ని తెలిపాడు వారు నగదు ట్రాన్స్ఫర్ చేసిన ఖాతా ను పరిశీలించారు ఎస్.బి.ఐ రాజేష్ కుమార్ అని తేలింది మరొక కథను పరిశీలిస్తే అనిల్ కుమార్ ఉందని తెలపడంతో నిర్ఘాంతపోయాడు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.