ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న బైక్​.... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు.. - Bike accident at Anantapur District Somandepalli

ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. మృతుడు ఇందిరానగర్​కు చెందిన వాలంటీర్ దేవరాజ్​గా గుర్తించారు.

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న బైక్​.... ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..

author img

By

Published : Jan 15, 2021, 2:10 AM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని నలగొండరాయునపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమందేపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్​కు చెందిన వాలంటీరు దేవరాజు... మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దేవరాజ్ మృతిచెందాడు. సోమందేపల్లికి చెందిన జగదీష్, చాకర్లపల్లికి చెందిన శ్రీకాంత్​కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

అప్పుల బాధ భరించలేక.. అన్నదాత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.