అనంతపురం జిల్లా కనికేల్ మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. చేపల చెరువు సమీపంలోని సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రంలో... చింతలమ్మ అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. చింతలమ్మ రాత్రయినా ఇంటికి రాకపోవటంతో... కుటుంబసభ్యులకు చెరువు ప్రాంతానికి వెళ్లి వెతికారు. చింతలమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వసతి గృహంలో ఉరేసుకొని విద్యార్థిని బలవన్మరణం