అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి. హిరేహాల్ మండలం నాగలాపురం వద్ద తుంగభద్ర దిగువ కాలువకు గండి పడింది. గ్రామానికి సమీపంలోని హెచ్ఎల్సీ కాలువకు... ఆదివారం రెండుచోట్ల రంధ్రాలు ఏర్పడ్డాయి. తుంగభద్ర జలాలు వృథాగా వాగులు, వంకలుకు వెళ్లిపోవటంతో... ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమై జేసీబీ, టిప్పర్ సహాయంతో కాలువకు ఏర్పడిన గండిని పూడ్చారు.
ఇదీ చూడండి: తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి..