ETV Bharat / state

ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలంటూ నర్సుల ఆందోళన - Nurses protest at Anantapur

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సులు ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Nurses  protest in front of Anantapur Government Hospital
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సులు ఆందోళన
author img

By

Published : Aug 26, 2020, 7:42 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సులు ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని నేతలు, అధికారులు హామీలు ఇచ్చినా.. అది నెరవేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నామన్నారు. ఇలాంటి సమయంలో తాము కోరుకుంటున్నది ఉద్యోగ భద్రత మాత్రమే అని చెప్పారు. ముఖ్యమంత్రి స్పందించి.. తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

వైకాపా ప్రభుత్వం... ఓటేసిన వారినే కాటేస్తోంది: శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.