అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురంలో మాజీఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉందని చెప్పారు.
ధర్మవరం ఎన్టీఆర్ కూడలి వద్ద... ఎన్టీఆర్ విగ్రహానికి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కాటమయ్య నివాళులు ఆర్పించారు. కొత్తపేట పల్లవి కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు.
కదిరిలో నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలన్న సంకల్పంతో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని కందికుంట వెంకటప్రసాద్ గుర్తు చేశారు.
ఉరవకొండ పట్టణ తెదేపా నాయకులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా తెదేపా జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ ముందు... ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవ, రాజకీయాల్లో తెచ్చిన చైతన్యం గురించి కొనియాడారు.
ఇది చదవండి ఎన్టీఆర్ దేశానికే ఆదర్శం.. ఆయన బాట అనుసరణీయం: బాలకృష్ణ