కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అనంతపురం జిల్లా గుంతకల్లు వాసులు ఇవి పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం లేకుండా ఎన్ని కఠిన ఆంక్షలు అమలు చేసినా ఏం లాభమంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి బ్యాంకులు, మార్కెట్ల వద్ద నీడ వసతిని కల్పించి, సామాజిక దూరం పాటించేలా క్యూ లైన్లు, మార్కింగ్లు ఏర్పాటు చేసి, చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...