అనంతపురం జిల్లా కనేకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నిర్మల... స్థానిక గ్రామ సచివాలయం-1లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్‌గా నబిసాబ్తో పాటు 19 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైకాపా మద్దతుదారుగా 2251 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్ పురస్కారాలు