ETV Bharat / state

టీడీపీ శ్రేణుల్లో నూతన సంవత్సర ఉత్సాహం- వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడాలంటూ శుభాకాంక్షలు

New Year Celebrations in AP:రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు టీడీపీ కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. పలువురు టీడీపీ నేతలు కేక్​ను కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి దుస్తులు పంపిణీ చేశారు. 2024లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని ప్రజలకు తెలిపారు.

New_Year_Celebrations_in_AP
New_Year_Celebrations_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 3:57 PM IST

New Year Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా సాగాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ కలిసి 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

New Year Celebrations In Anantapur TDP Office: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం టీడీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేక్​ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి టీడీపీ (TDP) పాలన పునవృతం కావాలని ప్రజలకు తెలియజేశారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను యువత సందడిగా నిర్వహించారు. నగరపాలిక అధికారులు క్లాక్ టవర్ (Clock Tower)​ను విద్యుత్ దీపాలతో అలంకరించటంతో కాంతుల వెలుతురులో యువత కేరింతలు కొడుతూ కేక్​లు కట్ చేసి నృత్యాలు చేశారు.పెద్ద సంఖ్యలో యువత తరలి రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు.

Celebrations in NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆమెను కలిసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Wishes) తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని సౌమ్య ఆకాంక్షించారు.

Ongole: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి. నగర వ్యాప్తంగా నూతన సంవత్సరం సంబరాల్లో చిన్నాపెద్దా అందరూ పాల్గొని పలుచోట్ల కేక్​లు కట్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరులో యువత కేరింతలు కొడుతూ, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఐడియల్ యూత్ మూవ్​మెంట్ అనే సంస్థకు చెందిన యువకులు ఫ్లకార్డులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ వన్ ఫంక్షన్ హాల్లో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించడంతో కుటుంబ సభ్యులతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

Kurnool: కర్నూల్లో రాజ్​విహర్ (Raj కూడలి వద్దకు 12గంటలకు భారీగా యువత చేరుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పోలీసులచే కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రాలో నూతన సంవత్సర వేడుకలు- వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.