అనంతపురం జిల్లా హిందూపురంలో టీచర్స్ కాలనీకి చెందిన సువర్ణ భాయి కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసింది. అతని కుమారుడు మూడు రోజుల క్రితం మహమ్మారి కాటుకు బలయ్యాడు. భర్త కొన్ని సంవత్సారాల క్రితం చనిపోయాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబ సభ్యులేమో కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సువర్ణ భాయి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానికులు.. టిప్పు సుల్తాన్ ముస్లిం నగారా ప్రజా సంఘం యువతను సంప్రదించారు. వారు చివరి తంతు పూర్తి చేశారు. కరోనాతో మృతిచెందిన వారికి.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్న వారిని పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:
అసలే కరోనా.. ఆపై ఒకే బెడ్డుమీద ఇద్దరు చొప్పున రోగులకు చికిత్స..!!