అనంతపురం జిల్లా హిందూపురంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరితే.. అక్కడ వైద్యులు పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మెరుగైన సేవలు అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు.. కరోనా బారిన పడిన పారిశుద్ధ్య కార్మికులు శ్రీనివాసులు, జబ్బార్‌లకు హిందూపురం ప్రభుత్వాసపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని వాపోయారు.
ఇప్పటికే మహమ్మరి కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందారని, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కార్మికుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కార్మికులకు తెలపడంతో వారు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: