అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందు కోసం నిర్దేశించిన "నాడు నేడు" కార్యక్రమం ద్వారా నిధులు మంజూరయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మౌలిక వసతుల కల్పన..
ఉన్నత పాఠశాలలో ప్రత్యేక గదులు, నీటి వసతి, ప్రహరి గోడ నిర్మాణంతో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ దృష్ట్యా సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు నూతనంగా నిర్మించిన గదులను శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ పాఠశాలలో సదుపాయాలను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఎస్పీ