దివ్యాంగ చిన్నారుల పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని అనంతపురం జిల్లా కదిరి ఎమ్యేలే సిద్ధారెడ్డి చెప్పారు. వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ఈ తరుణంలో పట్టణంలోని "భవిత కేంద్రంలో" ప్రత్యేక అవసరాల పిల్లలకు కావలసిన పరికరాలను పంపిణీ చేశారు.
ఆ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర నిర్వాహకులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: