ETV Bharat / state

తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి... - తాడిపత్రి ఘర్షణ

mla-peddareddy-went-to-attack-the-house-of-jc-prabhakar-reddy
తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...
author img

By

Published : Dec 24, 2020, 1:19 PM IST

Updated : Dec 24, 2020, 7:17 PM IST

13:16 December 24

తాడిపత్రిలో తెలుగుదేశం, వైకాపా బాహాబాహీ

తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...

         తాడిపత్రి మరోసారి భగ్గుమంది. ఏకంగా వైకాపాఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి  ఇంటికెళ్లి అనుచరులతో హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో జేసీ వర్గీయుడిపై  పెద్దారెడ్డి మనుషులు దాడి చేయడం ఉద్రిక్తలను రాజేసింది. ఈ ఘటనపై ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

               అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తన అనుచరులను వెంటబెట్టుకుని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ ఉన్న వారిని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కిరణ్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు.

మరింత వేడెక్కింది..

                 విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో.. పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేసీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అనుచరులు భారీగా ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి, జేసీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలో కార్లు ధ్వంసమయ్యాయి. జేసీ ఇంటికి వెళ్లి పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని ప్రభాకర్‌రెడ్డి అనుచరులు తగలబెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు

           పోలీసుల వైఫల్యం వల్లే తన ఇంటిపై దాడి జరిగిందని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తాను ఇంట్లో లేని సమయంలోనే ఎమ్మెల్యే అనుచరులు విధ్వంసం సృష్టించారన్నారు.  వీడియో ఫుటేజీలు పరిశీలిస్తే తప్పెవరిదో తెలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదన్న జేసీ....ఈ ఘటనపై ఫిర్యాదు చేయనని తెగేసి చెప్పారు.

ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జేసీ ఇంటి వద్ద పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. తాడిపత్రిలో 144 సెక్షన్‌ విధించారు.  

మహిళను కించపరిచేలా పోస్టు పెట్టినందుకే..

           తాడిపత్రి ఘటనపై  హోంమంత్రి సుచరిత స్పందించారు. ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నానని మంత్రి అన్నారు. మహిళను కించపరిచేలా పోస్టు పెట్టినందుకు ఎమ్మెల్యే అడగడానికి వెళ్లారని స్పష్టం చేశారు. తాడిపత్రిలో వివాదం సద్దుమణిగిందని  హోంమంత్రి సుచరిత తెలిపారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

తాడిపత్రి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనంతపురం  ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారని ఎస్పీ అన్నారు. వైరల్‌ చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లారని ఎస్పీ అన్నారు.

తప్పుంటే చర్యలు తీసుకోవాలి కానీ దాడి చేస్తారా?: కాలవ

జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆయన అనుచరులపై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేయటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే దాడి జరగటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెదేపా సోషల్ మీడియా కార్యకర్తలు తప్పు చేసి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే కానీ, ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి భౌతిక దాడులకు ఒడికట్టడం తగదని సూచించారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వ ప్రోద్భలంతో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని..., అహంకారంతో విర్రవీగిన అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారని వైకాపా నేతలు గ్రహించాలని కాలవ హితవు పలికారు. 

ఇదీ చదవండి: నేతల గృహ నిర్బంధాలపై చంద్రబాబు ఆగ్రహం

Last Updated : Dec 24, 2020, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.