అనంతపురం జిల్లా జీడిపల్లి సర్పంచి వెంకటనాయుడు.. ఫిబ్రవరి 25న ద్విచక్రవాహనంపై ఆత్మకూరు వెళ్తుండగా కళ్యాణదుర్గం మండలం మానిరేవు శివారులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ అనంతపురం వెళ్లిన ఎమ్మెల్యే.. సర్పంచి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ