Minister Ushasri Charan Comments: భూములు కొంటే తప్పు ఏముందంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రశ్నించారు. తనపై వస్తున్న మీడియా కథనాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలో పార్టీ కన్వీనర్ల సమావేశానికి వచ్చిన ఆమె.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమామహేశ్వర నాయుడు, మారుతి చౌదరిలు తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్న మంత్రి.. బహిరంగ చర్చకూ సిద్ధమా అని ప్రశ్నించారు.
తాము భూములు కొంటే తప్పేముందని,.. మీరు కొనడం లేదా అంటూ విలేకరులను ఉషశ్రీ చరణ్ ప్రశ్నించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవినీతి చేసినట్లు నిరూపించాలని గతంలోనే తాను తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ చేసినా... ఇప్పటివరకు ఒక్కరూ మందుకు రాలేదన్నారు.
ఆధారాలున్నాయి: మంత్రి సవాల్‌పై హనుమంతరాయ చౌదరి, మారుతీ చౌదరి స్పందించారు. మంత్రి ఉష శ్రీచరణ్ భూఆక్రమణలపై ఆధారాలు ఉన్నాయని మారుతీ చౌదరి స్పష్టం చేశారు. సుజలాన్ కంపెనీ నుంచి అక్రమంగా భూములు కొన్నారన్నారు. అసైన్డ్ భూములను మంత్రి బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా భూముల కొనుగోలు చేశారన్నారు. తుపాకీతో బెదిరించి పేదల భూములు కొంటున్నారని మారుతీ చౌదరి తెలిపారు.
ఇవీ చదవండి: