రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని తగిన చర్యలు చేపడుతోందని మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అందుకుగాను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
మంత్రి శంకర్ నారాయణ పిచికారి చేసి ప్రజలకు కరోనా నియంత్రణకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలన్నారు.
ఇవీ చూడండి: