అనంతపురం జిల్లా ప్రజలకు కరోనా పరీక్షలు చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం నగరంలోని శ్రీనగర్ కాలనీలో నీరు-ప్రగతి పార్కు వద్ద కొవిడ్-19 ఐమాస్క్ బస్సు(శాంపిల్స్ కలెక్షన్)లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు.
జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం కరోనా వ్యాప్తి చెందడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు. కరోనా రోజురోజుకీ పెరుగుతున్నందున జిల్లా యంత్రాంగం అన్ని రకాల కట్టడికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కువ కేసులు నమోదైనా కోలుకున్నవారు అధికంగా ఉండటం సంతోషించాల్సిన విషయమని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు వెంటనే కరోనా పరీక్షలు చేయిచుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: కళ్యాణదుర్గంలో తెదేపా నాయకుల ఆందోళన