మధుర ఫలం ధర గిట్టుబాబు కాక చెట్టుకే వేలాడుతోంది. అనంతపురం జిల్లా పరిగి మండలం నుంచి ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేసేవారు. కరోనా నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. అంగడిలో కిలోకు రూ.7 కూడా పలకడం లేదని.. కోత ఖర్చులూ రాకపోవడంతో గిట్టుబాటు కాక పంటను ఇలా చెట్లకే వదిలేశారు.
కొవిడ్ కారణంగా వరుసగా రెండో ఏడాదీ నష్టాలపాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఖర్చు ఎందుకని కాయలను చెట్లకే వదిలేశామంటున్నారు.
ఇదీ చదవండి: