ETV Bharat / state

'మన అనంత-సుందర అనంత' కార్యక్రమానికి భారీ స్పందన

'మన అనంత-సుందర అనంత' కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొంటున్నారు.

అనంతపురంలో 'మన అనంత-సుందర అనంత' కార్యక్రమం

author img

By

Published : Feb 22, 2020, 7:26 PM IST

'మన అనంత-సుందర అనంత' కార్యక్రమానికి భారీ స్పందన

అనంతపురం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు '​మన అనంత-సుందర అనంత' అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని జిల్లా పాలనాధికారి, ఎమ్మెల్యే, ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు స్థానిక అంబేడ్కర్​ నగర్​లో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టర్ పిలుపు మేరకు ఆటో యూనియన్ సభ్యులు భాగస్వాములు అయ్యేందుకు ముందుకొచ్చారు.

రోడ్లను, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. మొక్కలను నాటారు. ప్రతి వారం ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుండటంపై ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. సంఘాలు, యూనియన్​లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయని కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. 4 వారాల్లో పట్టణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మన పట్టణాన్ని శుభ్రంగా మార్చాల్సిన బాధ్యత మనదేనని... ఎంపీ రంగయ్య పేర్కొన్నారు. ప్రతీ వారం తాము ఇలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటం వల్ల చాలా సమస్యలు తెలుస్తున్నాయని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అనంతపురంలో 'మన అనంత-సుందర అనంత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.