భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని, పలుమార్లు ప్రాధేయపడినా కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరుకు చెందిన నగేష్‌కు... నాలుగేళ్ల కిందట నల్లచెరువు మండలానికి చెందిన యువతితో పెళ్లైంది. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో... మనస్పర్థాలు వచ్చాయి.
నగేష్ భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను నిర్లక్ష్యం చేసింది. నగేష్ భార్యకు నచ్చజెప్పినా ఆమెలో మార్పురాలేదు. 3 నెలల కిందట కూతురుతో కలిసి నగేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. కాపురానికి రావాలని బతిమాలినా వినిపించుకోలేదు. మరోసారి అత్తారింటికి వెళ్ళిన నగేష్‌కు భార్య కనిపించలేదు. దీంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. నగేష్ పరిస్థితి విషమంగా ఉంది.