అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జాపల్లిలో అంకోల-బళ్లారి 67వ నెంబర్ జాతీయ రహదారిపై కురుస్తున్న భారీ వర్షలకు చెరువు ఉద్ధృతంగా ప్రవాహిస్తున్నాయి. వాగు దాటుతుండగా...ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. చెర్లోపల్లికి చెందిన శ్రీరాములు అనే రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. చెర్లోపల్లి నుంచి గుత్తి వైపు వస్తుండగా...ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వాగులో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరువ వంకలో ఆటో, లారీ చిక్కుకున్నాయి. ఆటోలో ఉన్న ప్రయాణికుల్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. రోడ్లు గుంతలమయమైనందునే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని... సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.