కరోనా సృష్టించిన కఠిన పరిస్థితులు... మానవ భావోద్వేగాలనూ అదుపు చేస్తున్నాయి. కన్నకొడుకు మరణించినా... కడసారి చూసుకోలేని స్థితిని కల్పించాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన సుంకన్న బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చిన్నహోటల్ నిర్వహిస్తున్న సుంకన్న శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య ప్రస్తుతం ఏడునెలల గర్భిణీ. సొంతూరిలో తల్లిదండ్రుల సమక్షంలో అంత్యక్రియలు చేద్దామనుకున్న ఆమె మృతదేహంతో ఊరికి బయలుదేరింది. అయితే అంత్యక్రియలు పూర్తైన తర్వాత 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పటంతో అన్ని రోజులు తనకు వీలుకాదని భావించిన ఆమె... మార్గంమధ్యలోనే వెనుతిరిగింది. వీడియో కాల్‌లోనే తల్లిదండ్రులు సుంకన్నను కడసారి చూశాక... భాగ్యనగరంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన పాల అమ్మకాలు: నష్టపోతున్న పాడిరైతు