అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పామిడి పట్టణంలోని బొడ్రాయి సమీపంలో భూమి కుంగిపోయింది. ఆముదాల వీధిలో నివసిస్తున్న మాబు ఇంటి పక్కన భూమి కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గుంతలో నిచ్చెన వేసేందుకు ప్రయత్నించగా...భూమి ఇంకా లోపలికి పోతుందని స్థానికులు అంటున్నారు. ఈ గుంత లోపల సొరంగం ఉన్నట్లు గుర్తించారు. ఈ సొరంగం లోపలి వైపున మరో మార్గం ఉన్నట్లు మాబు అంటున్నారు. సొరంగం చాలా లోపలికి ఉండడం వల్ల ఇళ్లు కూలిపోతుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సొరంగం ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : రేపటి నుంచి ద్వారకా తిరుమలలో కల్యాణ మహోత్సవాలు