ETV Bharat / state

అనంతపురంలో ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..

Brahmotsavalu at Rolla: అనంతపురం జిల్లా రొళ్ల గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించిన భూతప్ప ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూతప్పల కాలి స్పర్శ కోసం వందల సంఖ్యలో భక్తులు బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకున్నారు.

bhutappa utsavalu at Anantapur
ఘనంగా భూతప్ప ఉత్సవాలు
author img

By

Published : Mar 23, 2022, 7:55 PM IST

Anantapur District news: అనంతపురం జిల్లా రొళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. గత కొన్ని రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన భూతప్ప ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూతప్పల కాలి స్పర్శ కోసం వందల సంఖ్యలో భక్తులు తడిబట్టలతో బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకున్నారు.

బూతప్ప కాలి స్పర్శ కోసం భక్తులు తడి బట్టలతో భూతప్పల నడిచే మార్గంలో బోర్లా పడుకున్నారు. ఉర్రాల శబ్దాలకు అనుగుణంగా నడుస్తూ.. భక్తులపై కుడికాలితో తొక్కుకుంటూ భూతప్పలు వెళ్లారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అరటిపండ్లు కలిపిన బొరుగుల రాసులో తలదూర్చి నైవేద్యాన్ని భుజించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భూతప్పల ఉత్సవాల ప్రత్యేకతలు : 'శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లో భూతప్పల ఉత్సవాలు ప్రత్యేకత సంతరించుకుంటాయి. భూతప్పల స్పర్శ తగిలితే పిల్లలు లేనివారికి పిల్లలు జన్మిస్తారని భక్తుల నమ్మకం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయమవుతాయని, ఇళ్లలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యంలో పాల్గొంటారు. భూతప్పల కాలి స్పర్శ కోసం తడిబట్టలతో బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకుంటామని భక్తులు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో.. మహాకుంభాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.