అనంతపురం జిల్లా కదిరిలో పోలీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. మండలంలోని కుమ్మర వాండ్ల పల్లి, గాండ్లపెంటలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు రేయింబవళ్లు తేడా లేకుండా పాటుపడి.. ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు.
ఇదీ చదవండి: 'పోలియో రహిత సమాజమే లక్ష్యం'